చంపేస్తామంటూ పూజా హెగ్దేకు బెదిరింపులు.. స్పందించిన టీమ్

నటి పూజా హెగ్దేకు హత్య బెదిరింపులు వచ్చినట్లు వైరల్ అవుతున్న వార్తలపై ఆమె టీమ్ స్పందించింది. పూజాకు ఎలాంటి హత్య బెదిరింపులు రాలేదు. ఎవరితోనూ గొడవపడలేదు. ఇందులో ఎలాంటి నిజం లేదు. దయచేసి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది.

చంపేస్తామంటూ పూజా హెగ్దేకు బెదిరింపులు.. స్పందించిన టీమ్
New Update

స్టార్ నటి పూజా హెగ్దే హత్యా బెదిరింపుల ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినపుడు అక్కడ గుర్తు తెలియని వ్యక్తులతో ఆమె గొడవపడిందని, దీంతో ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై తాజాగా స్పందించిన ఆమె టీమ్.. ఇదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేసింది.

publive-image

అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న నటి పూజా హెగ్దే.. ఓ ప్రాజెక్ట్ విషయంలో ఇటీవల దుబాయ్‌ వెళ్లినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ క్రమంలోనే అక్కడే ఓ కార్యక్రమానికి ఆమె హాజరవగా కొంతమంది ఆకతాయిలు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు అక్కడ పెద్ద గొడవ జరగడంతో కొందరు వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారని బాలీవుడ్‌ మీడియాలో ఓ కథనం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పూజా ఫ్యాన్స్ ఆందోళనతో సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చకు దిగారు. తమ అభిమాన నటికి మద్దతుగా పోస్టులు పెడుతూ నానా హంగామా చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Parenting Tips: పేరేంట్స్ మీ ప్రవర్తనే…మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది..ఇలాంటి తప్పులు చేయకండి..!!

అయితే దీనిపై స్పందించిన ఆమె టీమ్ అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ ఖండించింది. 'డియర్ ఫ్యాన్స్.. పూజాకు ఎలాంటి ప్రమాదం లేదు. హత్య బెదిరింపులు రాలేదు. ఆమె ఎవరితోనూ గొడవపడలేదు. జనాలు ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో తెలియట్లేదు. ఇందులో ఎలాంటి నిజం లేదు. దయచేసి అవాస్తవాలను ఎవరూ నమ్మొద్దు' అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆమె ఫ్యాన్స్ శాంతించారు.

ఇక సినిమాల విషయానికొస్తే సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ బుట్టబొమ్మ.. షాహిద్‌ కపూర్‌ హీరోగా రాబోతున్న మరో బాలీవుడ్‌ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతోపాటు తెలుగులోనూ మళ్లీ వరుస ప్రాజెక్టులకు సైన్ చేస్తున్నట్లు సమాచారం.

#fake-news #pooja-hegde #death-threats
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe