Pooja gandhi: పెళ్లి పీటలు ఎక్కబోతున్న దండుపాళ్యం భామ! దండుపాళ్యం భామ పూజా గాంధీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆమె బిజినెస్ పార్టనర్, స్నేహితుడైన విజయ్ ను ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. By Bhavana 28 Nov 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి సినీ ప్రపంచంలో నిత్యం ఎవరో ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారనే వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ముద్దుగుమ్మ తమన్నా అతి త్వరలోనే ఆమె ప్రియుడు విజయ్ వర్మ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేసింది. కొద్ది రోజుల క్రితమే మెగా కంపౌడ్లో ఓ పెళ్లి వేడుక జరిగింది. ఇంకా చాలా మంది హీరోయిన్లు, హీరోలు నిశ్చితార్థాలు జరుపుకుని పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఆమె మరెవరో కాదు..కొంతకాలం క్రితం అందరినీ వణికించిన క్రైమ్ మూవీ దండుపాళ్యం సినిమా భామ పూజా గాంధీ. పూజా గాంధీ కన్నడ నటి అయినప్పటికీ కూడా దండుపాళ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె దగ్గరయ్యింది. ఈ అమ్మడు 2002 లోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. హిందీ లో కూడా ఓ సినిమా చేసి బాలీవుడ్ కి కూడా ఆమె పరిచయం అయ్యింది. ఆ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఆ తరువాత కన్నడ లో మొదటి సినిమా మాన్ సూన్ తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత ఆమె 30 సినిమాలు చేసి బిజీగా మారిపోయింది. ఆమె కేవలం కన్నడ నటిగానే స్థిరపడకుండా..తెలుగు, బెంగాలీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. దండుపాళ్యం సినిమా పూజా కెరీర్ ను ఓ మలుపు తిప్పింది. అన్ని సిరీస్ లు కూడా సూపర్ హిట్ గా నిలవడంతో ఆమె వరుస ఆఫర్లను అందుకుంది. తాజాగా పూజా పెళ్లి చేసుకోబోతుంది. సినిమా కెరీర్ స్టార్టింగ్ లో ఆమెకు కన్నడ భాషను నేర్పించి మంచి స్నేహితుడిగా ఉన్న వ్యక్తి విజయ్. పూజా విజయ్ తోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. పూజా బెంగాలీ అమ్మాయి అయినప్పటికీ కన్నడలో బాగా పేరు సంపాదించుకుంది. ఈమె అసలు పేరు సంజనా గాంధీ, అయినప్పటికీ.. సినిమాల్లోకి వచ్చాక పూజా గాంధీగా పేరు మార్చుకుంది. Also read: బోరు నుంచి నీళ్లు రావాలి కానీ..పాలు వస్తున్నాయేంటీ స్వామి! #marriage #heroin #vijay #pooja-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి