Ponnam Prabhakar: కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం కులగణన అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. By V.J Reddy 16 Feb 2024 in Uncategorized New Update షేర్ చేయండి Minister Ponnam Prabhakar: శాసన సభలో సమగ్ర కుల గణన తీర్మానానికి సభ ఏకగ్రవంగా ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం కులగణన అని అన్నారు. తాము ఎవరికి వ్యతిరేకం కాదని... బలహీన వర్గాల శాసన సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండాలని అన్నారు. అందరికీ న్యాయం జరగాలని.. పిల్లలు విద్య, ఆర్థిక రాజకీయ స్థితిగతులు మెరుగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ALSO READ: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి నలుగురు నేతలు బలహీన వర్గాలకు న్యాయం... ఇది విధివిధానాలను సంబంధించి శాసన సభ్యుకు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆకాంక్షించెవారు ..రాజకీయ పార్టీల వారు అందరి సహకారం తీసుకుంటాం అని అన్నారు. ఎక్కడ వివక్ష పూరితంగా వ్యవహరించం అని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని వెల్లడించారు. 2011 ఢిల్లీలో కేంద్రం చట్టం చేసిందని.. ఓ బీసీ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఈ దేశంలో 20 రాష్ట్రాలు తిరిగినట్లు పేర్కొన్నారు. 2011లొ ఎలాంటి చట్టం చేయకుండానే కుల గణన జరిగిందని గుర్తు చేశారు. చేసిన లెక్కలు.. ఖర్చు చెప్పాలి.. కుల గణనకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లెక్కలు.. అయ్యిన ఖర్చు చెప్పాలని అన్నారు. బలహీన వర్గాల మంత్రిగా ఒక కార్పొరేటర్ బలహిన వర్గాల సీటును వేరే వ్యక్తి తీసుకొని గెలిచిండు అని కలెక్టర్ ప్రొసిండింగ్ ఇస్తే ఆ బీసీ కి అన్యాయం జరగవద్దని స్టే తెచ్చినట్లు చెప్పారు.. దానిని రికార్డు తో సహా ఇస్తానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అనేక కుల ఫెడరేషన్ లు వేశారని గుర్తు చేశారు. ఆత్మగౌరవ భవనాలు ఉన్నాయి ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదని ఆరోపించారు. బీసీ బంధు ఏమైంది.. 2018, 2023 ఎన్నికల్లొ తప్ప బీసీ బంధు పేరు మీద ఎన్నడూ ఆర్గనైజేషన్ పని చేయలేదని అన్నారు. 2014-23 వరకు తొమిదిన్నర సంవత్సరాల్లో 23 వేల కోట్లు ఖర్చు తప్ప ఏమి లేదని విమర్శించారు. కుల గణన ఇంటింటికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఎలాంటి సమాచారం తీసుకుంటే బాగుంటుందని మీ అందరి సలహాలు తీసుకుంటామని అన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైనా ఇబ్బంది ఉన్న మీకు ప్రశించే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ALSO READ: త్వరలో ఇంటిటి సర్వే.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం DO WATCH: #cm-revanth-reddy #minister-ponnam-prabhakar #caste-census-bill #caste-census-bill-in-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి