Karimnagar : ఓ వెధవ.. ఓట్ల బిచ్చగాడ.. బండిని పొట్టు పొట్టు తిట్టిన పొన్నం!

బీజేపీ నాయకుడు బండి సంజయ్ ను కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పొట్టు పొట్టు తిట్టారు. ఓ వెధవ, ఓట్ల బిచ్చగాడ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ వెళ్లిన బండి సంజయ్ అక్కడ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ క్లిక్ చేయండి.

New Update
Karimnagar : ఓ వెధవ.. ఓట్ల బిచ్చగాడ.. బండిని పొట్టు పొట్టు తిట్టిన పొన్నం!

Bandi Vs Ponnam : కరీంనగర్(Karimnagar) ఎంపీ, బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay) ను కాంగ్రెస్(Congress) మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పొట్టు పొట్టు తిట్టారు. ఓ వెధవ, ఓట్ల బిచ్చగాడ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజక వర్గానికి వెళ్లిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం, పొన్నం ప్రభాకర్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. రాముని గురించి కూడా ప్రస్తావించారు. దీంతో వేములవాడ నియోజకవర్గంలో నాంపల్లి గుట్టమీద ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి బండిపై మండిపడ్డారు.

తల్లి పేరు ప్రస్తావిస్తావా?
ఈ మేరకు శివరాత్రి ఉత్సవాలు, నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ తల్లి పేరు తీసింది సంజయ్.. నేనెప్పుడూ కూడా తీయలేదని అన్నారు. కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితోపాటు బీజేపీ ప్రభుత్వం రాముని పేరుతో ఓట్లు అడుక్కుంటున్నారనరి, ఓట్ల బిచ్చగానిగా మారారని అన్నారు. అలాగే 'ఓ వెధవ తల్లి పేరు నువ్వు తీసావా? నేను తీసానా?అంటూ మండిపడ్డారు. బతికున్న తన తల్లిని పట్టుకుని ఆత్మ ఘోచిస్తుందంటవా అంటూ బండిపై ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండి : Amit Shah : ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు.. అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు!

నీ అంత మూర్ఖున్ని కాదు..
ఇప్పటికే కరీంనగర్ ఎమ్మెల్యేగా మూడుసార్లు ఓటమి చవిచూపిన బండి సంజయ్ ఏరోజైనా ఎంపీకీ రాజీనామా చేశారా? అన్ని ప్రశ్నించారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అని సంజయ్ సవాల్ విసిరడాన్ని పొన్నం తప్పుపట్టారు. రాముని గురించి తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, అంత మూర్ఖుని కాదన్నారు. అలాగే తన తల్లి బతికి ఉండగానే తల్లి ఆత్మ చూపిస్తుందంటూ తల్లి పేరు రాజకీయాలు చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం చేసిన వ్యాఖ్యలను పొన్నం గుర్తు చేశారు. అలాగే ఎంపీగా ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. 'సిద్దిపేట హనుమకొండ మధ్యలో పలువురు ప్రయాణిస్తుంటారు. అందులో ఈయన ఒక ప్రయాణికుడు. ఐదేళ్ల పదవీకాలంలో ఎప్పుడు ఒక నిర్మాణాత్మకమైన పని చేయని సంజయ్ ఉపాధ్యాయ పథకం గూర్చి ఇతరత్రా ప్రభుత్వ పథకాలను తనవిగా చెప్పుకుంటున్న ఒక వెధవ' అంటూ విమర్శలు గుప్పించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు