దేశరాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య కొరల్లో చిక్కుకుంది. పొగమంచుకు కూడా గాలి కాలుష్యం తోడవ్వడంతో అక్కడ పరిస్థితులు అధ్వానంగా మారాయి. ఆదివారం అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను దాటింది కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు ఆంక్షలు విధించారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వాయు కాలుష్యం పెరగకుండా ఆపేందుకు ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది.
Also Read: కరోనా లాంటి మరో వైరస్.. థాయ్‌లాండ్‌లో గుర్తించిన శాస్త్రవేత్తలు..
బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై ఆంక్షలు
అయితే ఈ యాక్షన్ ప్లాన్‌లో స్టోన్ క్రషర్స్ మూసివేయడం, మైనింగ్‌కి సంబంధించిన కార్యకలాపాలు, నిర్మాణాలు, కూల్చివేతలపై ఆంక్షలు ఉన్నాయి. ఢిల్లీ, ఫరీబాద్, గౌతమ్ బుద్ధ నగర్, గురుగ్రామ్ జిల్లాల్లో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలపై ఆంక్షలుంటాయి. అలాగే నేషనల్ క్యాపిటర్ రీజియన్ (NCR) పరిధిలోని రాష్ట్రాలు ఐదోతరగతి వరకు పిల్లలకు సెలవులిచ్చి.. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించే అవకాశం ఉంది.
దారుణంగా గాలి నాణ్యత
ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 478కి చేరింది. ఇక నెహ్రూ స్టేడియం, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఐటీఓ ప్రాంతాల్లో 565-455 మధ్య గాలి నాణ్యత ఉంది.
Also Read: దేశంలోనే తొలిసారి.. AIతో 62ఏళ్ల రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స!