BREAKING: కాంగ్రెస్‌లో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు
బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు షర్మిల.
బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు షర్మిల.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరోసారి లేఖ రాశారు మాజీ మంత్రి హరి రామజోగయ్య.. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ ప్రమోట్ చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైన పథకాలకు కూడా చోటు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
TG: జాబ్ క్యాలెండర్‌పై రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు కేటీఆర్. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో చెప్పకుండా జాబ్ లెస్ క్యాలెండర్‌ను విడుదల చేసిందన్నారు. దీనిపై అశోక్ నగర్‌కు వచ్చి నిరుద్యోగాలకు రాహుల్ వివరణ ఇవ్వాలన్నారు.
AP: రాజధాని అమరావతిలో ఈరోజు ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పర్యటించనుంది. సెక్రటేరియట్, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే.
కూచిపూడిలోని రవిప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రిలో ధన్వంతరి వార్డును ప్రారంభించింది.. దీని వల్ల మరింత మంది రోగులకు ఎక్కువ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని హాస్పిటల్ యజమాన్యం తెలిపింది.
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు పర్యటనకు వెళ్లనున్నారు. రాత్రి HYD నుంచి అమెరికాకు సీఎం బృందం బయలుదేరనుంది. పది రోజులపాటు అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. ఈ నెల 14న తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.
హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామని..దాని నిర్మాణానికి బీసీసీఐని ఒప్పించినట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే భూమిని కేటాయిస్తామని, హైదరాబాద్‌లోని బ్యాగరి కంచెలో ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి సమీపంలోనే ఈ స్టేడియం నిర్మాణం చేపడుతామని తెలిపారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ శుభవార్తను తెలియజేశారు.టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
మద్యం షాపులు మినహా హైదరాబాద్ నగరంలో రాత్రి 1 వరకూ అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ఇక ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోకి తరలిస్తామన్నారు.