CM Revanth: హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం షాపులు తప్ప మిగతా ఏ వ్యాపారమైనా నడిపించుకోవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. వైన్ షాపులకు ఈ అవకాశం ఇస్తే విచ్చలవిడిగా తాగే అవకాశం ఉందని, అందుకే దాన్ని మినహాయిస్తున్నట్లు చెప్పారు. రాత్రి 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో ఇబ్బంది అవుతోందని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉస్మానియా ఆసుపత్రిని తరలిస్తామని చెప్పారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోకి తరలిస్తామన్నారు. 30 ఎకరాల్లో హాస్పిటల్ కోసం భవనం నిర్మిస్తామని, పాత ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ భవనంగా కొనసాగిస్తామని అసెంబ్లీలో వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్‌పై సీఎం స్పెషల్ ఫోకస్.. రాత్రి హోటళ్లు, నాలాల కబ్జ, ఉస్మానియా ఆసుపత్రిపై కీలక ప్రకటన!
మద్యం షాపులు మినహా హైదరాబాద్ నగరంలో రాత్రి 1 వరకూ అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ఇక ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే తమ హయాంలో హైడ్రా తెస్తున్నామని చెప్పారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ లోకి తరలిస్తామన్నారు.
Translate this News: