TVK Vijay: తొక్కిసలాటపై స్పందించిన విజయ్.. అదే కారణం అంటూ వివరణ!

తమిళనాడులోని కరూర్‌ తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని టీవీకే ఛీఫ్ విజయ్ అన్నాడు. ఈ ఘటన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు.

New Update
tvk

Vijay: తమిళనాడులోని కరూర్‌ తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని విజయ్ అన్నాడు. ఈ ఘటన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన టీవీకే అధ్యక్షుడు విజయ్.. 'నా హృదయం గాయంతో నిండిపోయింది. ఏం మాట్లాడాలో కూడా తోచట్లేదు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. నా జీవితంలో ఇలాంటి బాధాకరమైన పరిస్థితిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నా మనస్సు ఆందోళనతో నిండిపోయింది' అంటూ ఎమోషనల్ అయ్యాడు. 

Also Read :  హైదరాబాద్ బతుకమ్మ వేడుకల్లో విషాదం.. షాక్‌తో స్పాట్లో ముగ్గురు..!

కరూర్‌లోనే ఇలా ఎందుకు జరిగింది?

ఈ మేరకు తమవైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తానని హామీ ఇచ్చాడు.'నా లైఫ్ లో ఇంతగా ఎప్పుడూ బాధపడలేదు. నాపై ప్రజలు చూపుతున్న ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. అయితే నన్ను ప్రేమించే వారి భద్రత విషయంలో రాజీ ఉండకూడదు. రాజకీయాలకు అతీతంగా సేఫ్ జోన్ లో సభ జరగాలని కోరుకున్నా. పోలీసు శాఖను కూడా రిక్వెస్ట్ చేశాను. కానీ ఊహించని ఘటన నన్ను ఎంతో మనోవేదనకు గురిచేసింది. 5 జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తే కరూర్‌లోనే ఇలా ఎందుకు జరిగింది? త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తా. మేము ఏ తప్పు చేయకపోయినా పార్టీ నాయకులు, స్నేహితులు, సోషల్ మీడియా వినియోగదారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం దారుణం. ప్రజల ప్రాణాలు పోవాలని ఏ నాయకుడు అనుకోడు. తొక్కిసలాటపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తర్వలో నిజాలన్నీ బయటపడతాయి' అని చెప్పాడు విజయ్. 

Also Read: Couple Suicide : గుంటూరులో విషాదం...పెళ్లికి ఒప్పుకోలేదని..ప్రేమజంట సూసైడ్‌

సీఎం స్టాలిన్ కు కౌంటర్..

ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘సీఎం సర్.. మీరు నాపై పట తీర్చుకోవాలనుకువస్త్ర నన్ను ఏమైనా చేయండి. నేను ఇంట్లో లేదా ఆఫీస్‌లోనే ఉంటాను. కానీ ప్రజల జోలికి వెళ్లొద్దు. నా పొలిటికల్ జర్నీ మరింత ఉత్సాహంగా ముందుగు సాగుతోంది’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

కుట్ర కోణం..?

అయితే ఈ తొక్కిసలాటలో  కుట్ర కోణం దాగి ఉందని టీవీకే ఆరోపించింది.  విజయ్‌ ర్యాలీకి వచ్చిన కొంత సేపటికే  సభ ప్రాంగణంలో కొంత సమయం పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని టీవీకే తెలిపింది. అయితే  టీవీకే ఆరోపణలను తమిళనాడు విద్యుత్తు బోర్డు తిప్పికొట్టడంతో పాటు సంచలన విషయాన్ని వెల్లడించింది. విజయ్‌ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని కోరుతూ టీవీకేనే తమకు వినతిపత్రం ఇచ్చినట్లు ఆ రాష్ట్ర విద్యుత్తు బోర్డు చీఫ్‌ ఇంజినీర్‌ రాజ్యలక్ష్మి ధ్రువీకరించడం సంచలనంగా మారింది. అయితే విద్యుత్‌ సరఫరా నిలిపివేయడానికి తాము అంగీకరించలేదని రాజ్యలక్ష్మి వెల్లడించారు. 

టీవీకే నేతలు అరెస్ట్..

మరోవైపు తమిళనాడు పోలీసులు తమిళగ వెట్రి కజగం (టీవీకే) జిల్లా కార్యదర్శి మథియలగన‌ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా ఇతడిని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో టీవీకే చీఫ్ విజయ్ పేరు లేదు. మథియలగన్ (కరూర్ జిల్లా కార్యదర్శి), బుస్సీ ఎన్ ఆనంద్ (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), సీటీఆర్ నిర్మల్ కుమార్ (రాష్ట్ర సంయుక్త కార్యదర్శి) పేర్లు ఉన్నాయి. అయితే విజయ్ వేలుసామిపురం వద్దకు చేరుకునే ముందు అనధికారికంగా వీరు ముగ్గురు రోడ్‌షోలు నిర్వహించారని, అక్కడ పెద్ద జనసమూహం ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు