YCP: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు. మంత్రి నారా లోకేష్‌పై ట్విట్టర్‌లో అనుచితవ్యాఖ్యలు చేసినందుకు గతంలో కేసు నమోదు చేశారు. 41(A) క్రింద ఇటీవల నోటీసులు ఇచ్చారు.

MLA Tatiparthi Chandrasekhar
New Update

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు. తాటిపర్తి చంద్రశేఖర్ గతంలో మంత్రి నారా లోకేష్‌పై ట్విట్టర్‌లో అనుచితవ్యాఖ్యలు చేశారని కొన్ని రోజుల కిందట కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విషయంలో 41(A) క్రింద నోటీసులు చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు.

ఇది కూడా చదవండి: బిగ్‌ బ్రేకింగ్.. పవన్ బయటకు రా, జనసేన పార్టీ ఆఫీసు ఎదుట అఘోరి రచ్చ!

ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేస్తున్నారని..

గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కేసు నమోదు చేస్తన్నారని వైసీపీ పార్టీ నేతలు అంటున్నారు. అక్రమ కేసులపై తమను లాగుతున్నారని మండిపోతున్నారు. 

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు

ఇదిలా ఉండగా.. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డికి కూడా నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నానిపై కూడా కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, లోకేష్‌లను కొడాలి నాని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారని ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నం త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రా యూనివర్సిటీ లా విద్యార్ధిని సత్యాల అంజన ప్రియ ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం!

ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత వైసీపీ హయాంలో ఐదేళ్లుగా కొడాలి నాని పత్రికా ప్రకటనలు, అసెంబ్లీ సమావేశాల్లో వాడిన భాషపై ఆమె ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ను అవమానపరిచే విధంగా అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు

ఇది కూడా చదవండి: అఘోరీ కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం సతీమణి.. వీడియో వైరల్

#nara-lokesh #ap-ycp #MLA Tatiparthi Chandrasekhar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe