TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కవితకు బిగ్ షాక్.. నోటీసులు జారీ!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత పీఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డట్లు వెల్లడించిన సిట్ అధికారులు.. అతన్ని విచారణకు రావాలంటూ శనివారం నోటీసులు జారీ చేశారు.

New Update
Kavitha

MLC Kavitha

TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత పీఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డట్లు వెల్లడించిన సిట్ అధికారులు.. అతన్ని విచారణకు రావాలంటూ శనివారం నోటీసులు జారీ చేశారు. అలాగే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు సైతం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాగా విచారణలో అధికారులు మరితం వేగం పెంచారు. 

ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం మేరకు మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని గుర్తించారు. అందులో 228 మందికి నోటీసులు ఇచ్చి కేసులో వారి వాంగ్మూలం తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణరావు సైతం తన ఫోన్ ట్యాప్ అయినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే తన సంభాషనలు లీక్ అయ్యాయని, తన మాటలు విన్నట్లు రుజువులున్నాయని చెప్పారు. ఇక ఈ కేసులో కేంద్రమంత్రి, బండి సంజయ్ కుమార్‌ను సిట్ అధికారులు ఫోన్‌లో సంప్రదించారు. ఆయనతో పాటు ఆయన సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయినట్లు సిట్‌ గుర్తించింది. దీంతో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు సమాచారం. దీనిపై ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని బండి సంజయ్ తెలిపారు. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణపై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణ ఎటు పోతుందో అర్థం కావడం లేదన్నారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల టైమ్‌లోనే తన ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఫిర్యాదు ఇచ్చానని,  కానీ ఇప్పటివరకూ తనను విచారణకు పిలవలేదన్నారు. కానీ ఈ కేసుకు సంబంధం లేని కాంగ్రెస్‌ నేతలను విచారణకు పిలుస్తున్నారన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు