Jammu & Kashmir: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లానే (Omar Abdullah) బాధ్యతలు చేపడుతారని 'నేషనల్ కాన్ఫరెన్స్' పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కూటమి నిరంతరం పోరాడుతుందన్నారు.
పదవీకాలం మొత్తం ఒమర్ అబ్దుల్లానే..
ఈ మేరకు పదేళ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. పదవీకాలం మొత్తం ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉంటారు. ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్‌లోని రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. బుద్గామ్, గండేర్బల్ రెండు స్థానాల్లో విజయం సాధించారు. అధికారం పంచుకోవడం సమస్య కాదన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మేము కృతజ్ఞతలు చెబుతూ.. ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించరని నిరూపించారని ఆయన అన్నారు.
2019 ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని మేము అంగీకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించింది. దీంతో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం నుంచి విడిపోయిందని గుర్తు చేశారు. ఇక బుద్గామ్‌లో ఒమర్ అబ్దుల్లాకు 36010 ఓట్లు రాగా.. పీడీపీ అభ్యర్థి అఘా సయ్యద్ ముంతాజీర్ 17527 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.