/rtv/media/media_files/2025/10/07/manda-2025-10-07-20-26-29.jpg)
Manda krishna: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‍పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‍ను పొన్నం దున్నపోతు అని సంబోధిస్తే మరో దళిత మంత్రి వివేక్ వెంకటస్వామి ఖండించకపోగా సమర్ధించినట్లుగానే హావభావాలు ప్రదర్శించడంపై తీవ్రంగా మండిపడ్డారు. పొన్నం మాట్లాడిన తీరు మంచిది కాదన్నారు. దళితులు, బలహీనవర్గాల మధ్య ఈ వివాదం పెరగవద్దని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‍కు ఫోన్ చేశానని స్పష్టం చేశారు.
Also Read : ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?
ఈ మేరకు మందకృష్ణ మాట్లాడుతూ.. 'గొడవ త్వరగా పరిష్కారం కావాలని చూస్తున్నాం. పొన్నం ప్రభాకర్ చెప్పే క్షమాపణ మీదే ఆధారపడి ఉంది. కాబట్టి తక్షణమే పొన్నం క్షమాపణలు చెప్పాలి. లక్ష్మణ్ పరిధిలోని మైనార్టీ సంక్షేమశాఖ కార్యక్రమానికి అరగంట ముందుగా వెళ్లి అడ్లూరి రాలేదని ఎందుకు మాట్లాడారు? అసలు ఆ శాఖలో పొన్నం ప్రభాకర్, వివేక్ జోక్యం ఎందుకు? మీ శాఖల్లో ఇతరులు కోమటిరెడ్డి, పొంగులేటి జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా? పొన్నం, వివేక్‌ను సీఎం పంపితే ఆయన కూడా తప్పు చేసినట్లే. తోటి దళితుడిని అలా అనకూడదని ఖండించాల్సిన వివేక్ వెంకట స్వామి అడ్లూరిని హేళన చేస్తారా?' అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Nani Heroine: నానికి కలిసొచ్చిన హీరోయిన్.. ఈసారి 'జూలియట్' గా మళ్ళీ రొమాన్స్!
రెడ్లు, బీసీ, మాలలను ఆహ్వానించిన వివేక్ వెంకటస్వామి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‍ను పిలవకపోవడం అంటే అర్థం ఏమిటని అడిగారు. తోటి మాల సోదరుడుడే తోటి మాదిగ మంత్రిని కనీసం ఆహ్వానించాలనే సోయి కూడా లేదంటే మాదిగలను అవమానించినట్లే కదా? అన్నారు. ఎస్సీ వర్గీకరణతోపాటు ఉమ్మడి హక్కుల కోసం పోరాడాలంటూ మందకృష్ణ పిలుపునిచ్చారు.