కుక్కకాటు బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం

కర్నూలు నగరంలో వీధి కుక్కల దాడిలో గాయపడిన 36 మంది బాధితులకు నగరపాలక సంస్థ తరపున ఎమ్మెల్యే టిజి భరత్ రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.

New Update
tg Bharath

కర్నూలు నగరంలో వీధి కుక్కల బెడద అధికమైందని, వాటిని అరికడతామని రాష్ట్ర పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ వాణిజ్య శాఖల మంత్రి టిజి భరత్ తెలిపారు. గతంలో పాతబస్తీ, జోహరపురం ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో గాయపడ్డ 36 మంది బాధితులకు నగరపాలక సంస్థ తరపున ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని మంత్రి భరత్, అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణణ్‌తో కలిసి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నెల 31వ తేదీన తాను ప్రభుత్వ అతిథి గృహంలో సమీక్షలో ఉన్నప్పుడు చిన్నారులపై పిచ్చి కుక్కల దాడి గురించి తెలిపారు. ఈ దాడి జరిగిన అరగంటకే కలెక్టర్, కమిషనర్‌తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లానన్నారు.

ఇది కూడా చూడండి: యష్మీకి మాటల్లేవ్..! అవినాష్, రోహిణీ బుల్లెట్ పాయింట్స్.. రాయల్ క్లాన్ కు భారీ ట్విస్ట్

శాశ్వత పరిష్కారం చూపించాలి

బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించామన్నారు. అదే రోజు ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించామని తెలిపారు. గత రెండు నెలల నుంచి శునకాల సంతాన నియంత్రణ ఆపరేషన్లు ఆగిపోయాయని, వాటిని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఈ సమస్యకు తప్పకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చూడండి: Haryana Results: బీజేపీకి కలిసొచ్చిన కాంగ్రెస్ మిస్టేక్స్.. కమలం గెలపునకు 3 ప్రధాన కారణాలివే!

కుక్కల బెడద రాష్ట్రవ్యాప్తంగా ఉందని, ఇతర నగరాల్లో ఎలాంటి చర్యలు అనుసరిస్తున్నారో తెలుసుకోవాలని అధికారులను సూచించారు. కర్నూలు నగరంలో పూర్తి స్థాయిలో కుక్కల బెడదలను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించినట్లు తెలిపారు. వెంటనే వీధి కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్ ప్రారంభించాలని ఆదేశించారు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో వచ్చి అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేసి పనిచేయించారో ప్రజలు గమనించాలన్నారు.

ఇది కూడా చూడండి: BREAKING: బీజేపీకి ఊహించని పరాజయం!

ప్రజలకు కష్టాలు వస్తే, తాము ఎప్పుడు ముందు ఉంటామని భరత్ అన్నారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ మాట్లాడుతూ మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే సంతాన నియంత్రణ ఆపరేషన్ల సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన వివరాల ప్రకారం 36 మంది బాధితులకు ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు. మొత్తం 30 మందికి చెక్కుల రూపంలో, 6 మందికి నగదు రూపంలో ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర.. మరో 13 మందికి ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు