వాటా డబ్బులు అడిగినందుకు.. కాళ్లు, చేతులు కట్టేసి కిరాతంగా?

వ్యాపారంలో వాటా డబ్బులు అడిగినందుకు చంపేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. వెంకటప్పన్న, ద్వారకానాథ్‌రెడ్డి గతంలో కేటరింగ్ వ్యాపారం చేశారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వెంకటప్పన్న డబ్బులు అడగ్గా.. అతన్ని కట్టేసి బిజినెస్ పార్ట్‌నర్ కిరాతకంగా చంపేశాడు.

New Update
Rajasthan: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి బలవన్మరణం..

వ్యాపారంలో తన వాటా అడిగినందుకు కిరాతకంగా హత్య చేసి చింపేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన వెంకటప్పన్న రెడ్డి రెండేళ్ల కిందట హైదరాబాద్ వచ్చారు. భార్య, కుమారులతో కలిసి ఈస్ట్‌సాయినగర్‌లో నివసిస్తున్నారు. బాలానగర్‌లో ఓ సంస్థలో ఏజీఎంగా వెంకటప్పన్న పనిచేస్తున్నారు. అన్నమయ్య జిల్లాకి చెందిన ద్వారకానాథ్‌రెడ్డి వెంకటప్పన్న రెడ్డికి పరిచయం అయ్యాడు. 2021 సమయంలో ఇద్దరు కలిసి కేటరింగ్ వ్యాపారం చేశారు.

ఇది కూడా చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

పరువు పోయిందని..

ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వెంకటప్పన్న వ్యాపారం నుంచి తప్పుకున్నాడు. ద్వారకానాథ్‌రెడ్డి వ్యాపారంలో వాటా కింద వెంకటప్పన్నకు రూ.28 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. రోజులు, సంవత్సరాలు అవుతున్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటికి వెళ్లి వెంకటప్పన్న డబ్బులు ఇవ్వాలని నిలదీశాడు. ఇలా అందరి ముందు అడగడంతో కుటుంబ సభ్యుల ముందు పరువు పోయిందని భావించి ద్వారకానాథ్‌రెడ్డి అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఇది కూడా చూడండి: నేడే హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

తన స్నేహితులతో కలిసి వెంకటప్పన్నను హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. పథకం ప్రకారం.. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న వెంకటప్పన్నను కూకట్‌పల్లిలో అడ్డుకుని.. ముఖంపై క్లోరోఫాం చల్లారు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత కొత్తకోట తీసుకెళ్లి.. కాళ్లు, చేతులు కట్టేసి బీచుపల్లి బ్రిడ్జ్ నుంచి కృష్ణానదిలో వేశారు. ఈ నెల 4న భర్త ఫోన్ కాకపోవడం, రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం బయటకు వచ్చింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు.

ఇది కూడా చూడండి: జమ్మూ–కాశ్మీర్‌‌లో మళ్ళీ హంగ్ తప్పదా..మరికాసేట్లో తేలనున్న భవితవ్యం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు