Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఆరోజు నుంచే ఫ్రీ బస్ అమలు

నేడు ఏపీ మంత్రివర్గం భేటీ కానుండగా చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయాల తీసుకోనుంది. ఉచిత సిలిండర్లతో పాటు ఫ్రీ బస్సు అమలుపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దీపావళి మరుసటి రోజు నుంచే ఫ్రీ బస్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

Mahalaxmi Scheme: టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే..
New Update

Andhra Pradesh: ఇప్పటికీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకొచ్చాయి. మిగతా రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ కూడా మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకొచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుందనే చర్చ జోరుగా కొనసాగుతూనే ఉంది. చాలా సందర్భాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం భావించింది. కానీ ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించలేదు. అయితే నేటి నుంచి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఉచిత పథకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

ఇది కూడా చూడండి: America-Ap: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురి మృతి!

దీపావళి మరుసటి రోజు నుంచి..

ఈ సారి మాత్రం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది. మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. దీపావళి పండుగ నుంచి ఉచిత సిలిండర్ పథకం అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటు పడుతున్నారని తెలిపారు. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు కూడా ఇస్తామని గురజాల జగన్‌ మోహన్‌ తెలిపారు.

ఇది కూడా చూడండి: Ap Rains: తీవ్ర అల్పపీడనం..రేపు తీరం దాటనున్న వాయుగుండం!

పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలు బాగుంటేనే అంతా బాగుంటుందని నమ్మే వ్యక్తి సీఎం చంద్రబాబు అన్నారు. చంద్రబాబు పల్లె నుంచి సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి. అందుకే ఆయనది మంచి మనసు అన్నారు. గత ఐదేళ్ల నుంచి ఏ ఒక్క నాయకుడైనా వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకున్నాడా? అని జగన్ మోహన్ ప్రశ్నించారు. మేం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. 

ఇది కూడా చూడండి:  మందుబాబులకు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు.. ధర ఎంతో తెలుసా!?

ఇప్పటికే పెన్షన్‌ ఇస్తున్నామని.. దీపావళి నుంచి మీకు సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలు పెడతామని తెలిపారు. ప్రతీ 6 నెలలకు ఓసారి గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. దీపావళి పండుగకి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్సు అమల్లోకి తెస్తామని వెల్లడించారు. మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారని.. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు.

ఇది కూడా చూడండి: ఏపీలోని మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. రేపటి నుంచే..!

#andhra-pradesh #ap-free-bus-scheme #ap-free-bus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe