విశాఖపట్నానికి చెందిన శారదాపీఠానికి చంద్రబాబు సర్కార్ (Chandrababu Govt) షాక్ ఇచ్చింది. స్వరూపానందేంద్రకు చెందిన శారదపీఠానికి గత ప్రభుత్వం జగన్ (YS Jagan) ఇచ్చిన 15 ఎకరాల విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ఆర్మీ జవాన్ గా హాస్టల్ వంటమనిషి.. మహిళతో స్నేహం చేసి ఏం చేశాడంటే!
గురువు అడగడంతో..
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ స్వరూపానందేంద్రకు (Swaroopanandendra Swamy) చెందిన శారదపీఠానికి 15 ఎకరాల విలువైన భూమిని ఇచ్చారు. జగన్‌కు స్వరూపానందేంద్ర గురువు, అత్యంత సన్నిహితుడు కావడంతో భీమిలిలో సముద్రానికి దగ్గరగా ఉన్న కోట్ల విలువ చేసే భూమిని ఎకరానికి లక్ష చొప్పున ఇచ్చేశారు. దీన్ని గుర్తించిన చంద్రబాబు సర్కార్ శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి: టీతో సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
జగన్‌కు గురువుగా ఉన్న స్వరూపానందేంద్ర భీమిలో ఉన్న విలువైన ఆస్తిని కోరాడు. సంస్కృత పాఠశాలను నిర్మించి, వేద విద్యను అభ్యసించేందుకు భూములు కావాలంటూ.. ప్రభుత్వాన్ని కోరాడు. గురువు కోరడంతో జగన్ భీమిలిని దగ్గర ఉన్న ఈ స్థలాన్ని రాసి ఇచ్చేశారు. 15 ఎకరాలు విలువ చేసే ఈ భూమి విలువ రూ.225 కోట్లు. కానీ జగన్ శారదా పీఠానికి ఎకరం రూ.లక్ష చొప్పున రూ.15 లక్షలకు ఇస్తున్నట్లు 2021 నవంబరులో జీఓ విడుదల చేసింది.
ఇది కూడా చూడండి: 12 ఏళ్లుగా కడుపులో కత్తెర.. తర్వాత ఏమైందంటే?
జీవో విడుదల చేసిన స్వరూపానందేంద్ర రియాల్టీ బయట పడింది. పీఠానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఆ భూములను వాడుకోవాలన్నది వారి ఉద్దేశమని పాత జీవోను సవరించాలని తన వారసుడు అయిన స్వాత్మానందేంద్రతో కలిసి సీఎంకి లేఖ రాశారు. సముద్ర తీరంలో వాణిజ్య, నివాస ప్రాంతాలకు కూడా భూములు కేటాయించాలని కోరామని తెలిపారు. కానీ వేద విద్య వ్యాప్తికి, పీఠం కార్యకలాపాలకు అని పొరపాటున జీఓలో రాశారని లేఖలో తెలిపారు. దీనిపై ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేసింది.
ఇది కూడా చూడండి: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు