12 ఏళ్లుగా కడుపులో కత్తెర.. తర్వాత ఏమైందంటే?

వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. సిక్కిం రాష్ట్రంలోని ఓ మహిళకు 12 ఏళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగ్గా ఆ సమయంలో వైద్యులు కత్తెరను కడుపులో మరిచిపోయారు. రోజూ కడుపునొప్పి రావడంతో.. స్కానింగ్ చేయడంతో ఈ విషయం బయటపడింది.

New Update
SIKKIM

వైద్యులు చేసిన నిర్లక్ష్యం పని వల్ల ఓ మహిళ 12 ఏళ్లుగా నరకాన్ని అనుభవిస్తుంది. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ల మైమరపు వలన ఆమె కడుపులో 12 ఏళ్ల నుంచి కత్తెర ఉంది. డైలీ ఆ మహిళకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తాజాగా ఈ విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. సిక్కిం రాష్ట్రంలోని ఓ మహిళకు 12 ఏళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది.

ఇది కూడా చూడండి: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

స్కానింగ్ చేయడంతో చివరకు..

ఈ సర్జరీ జరిగే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ఆమె పొత్తి కడుపులోనే కత్తెరను వదిలేశారు. దీంతో ఆమె గత 12 ఏళ్ల నుంచి నొప్పితో బాధపడుతోంది. ఎందరో వైద్యుల దగ్గరకు వెళ్లిన కూడా ఆమెకు పొత్తి కడుపులో నొప్పి మాత్రం తగ్గలేదు. చివరకు స్కానింగ్ చేయడంతో కడుపులో కత్తెర ఉన్నట్లు తెలిసింది. 

ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి

ఆ మహిళ 2012లో అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుంది. గ్యాంగ్‌టక్‌లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మోమరియల్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. ఈ సమయంలో ఆమె కడుపులో కత్తెరను వైద్యులు మర్చిపోయారు. అలా అప్పటి నుంచి ఈ కత్తెర కడుపులోనే ఉండిపోవడంతో ఆమె తీవ్ర నొప్పికి గురయ్యింది. 

ఇది కూడా చూడండి: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

భరించలేని నొప్పి రావడంతో ఆ మహిళ ఇటీవల మరో ఆసుపత్రిలో చేరింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కత్తెరను బయటకు తీశారు. ఈ విషయం బయటకు తెలియడంతో గతంలో సర్జరీ చేసిన ఆసుపత్రిపై ఆమె ఫిర్యాదు చేసింది. అధికారులు ఆ హాస్పిటల్‌పై దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు