Bihar Election Polling: బిహార్‌లో ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్

బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు వరకు 60.13 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా బెగుసరాయ్ జిల్లాలో ఓటింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

New Update
Bihar Polling

Bihar Polling

బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు వరకు 60.13 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా బెగుసరాయ్ జిల్లాలో ఓటింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 18 జిల్లాలోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తి అయ్యింది. అయితే ఈ తొలి దశలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరగ్గా.. నాలుగు లక్షలకు పైగా పోలింగ్ సిబ్బందిని మోహరించారు. ఇక మిగతా 122 అసెంబ్లీ స్థానాలకు రెండో విడత పోలింగ్ మళ్లీ నవంబర్ 11న నిర్వహించనున్నారు.

ఇది కూడా చూడండి: Bihar Elections బిగ్ ట్విస్ట్.. ప్రశాంత్ కిషోర్‌కు 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు

60.18 శాతం ఓటింగ్..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల సంఘం ప్రకారం సాయంత్రం 5 గంటల నాటికి సగటున 60.18 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే మాధేపురలో 65.74% నమోదు కాగా, సహర్సాలో 62.65%, దర్భాంగాలో 58.38%, ముజఫర్‌పూర్‌లో 65.23%, గోపాల్‌గంజ్‌లో 64.96%, సివాన్‌లో 57.41%, సరన్ ‌లో 60.90%, వైశాలిలో 59.45%, సమస్తిపూర్‌లో 66.65%, బెగుసరాయ్‌లో 67.32%, ఖగారియాలో 60.65%, ముంగెర్‌లో 54.90%, లఖిసరైలో 62.76%, షేక్‌పురాలో 52.36%, నలందలో 57.58%, పాట్నాలో - 55.02%, బక్సర్‌లో 55.10% నమోదైంది.

ఇది కూడా చూడండి: Viral Video: డిప్యూటీ సీఎంపై చెప్పులు, పేడ విసిరిన ప్రజలు.. వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు