Kejriwal: ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్తు ఇస్తామని మాటిచ్చి.. అధికారంలోకి రాగానే మొహం చాటేసిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు ప్రతిపక్షాలపై ఆరోపణలు మాని, తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తే తాను బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివాంర ఢిల్లీలో నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. హామీలను నెరవేర్చుందుకు బీజేపీ సిద్ధంగా ఉందా అంటూ సవాల్ విసిరారు.
బీజేపీ పతనం ఖాయం..
'దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. హరియాణా, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పతనం ఖాయంగా కనిపిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాంటే ద్రోవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం. బీజేపీ ప్రజావ్యతిరేకం. బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో పాటు ఢిల్లీలో హోమ్‌గార్డుల వేతనాలను ఇవ్వలేదు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదు. ఇక్కడ ఎల్జీరాజ్యం నడుస్తోంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.