విశ్వగురు కాదు.. విష పురుగు: మోదీపై షర్మిల షాకింగ్ కామెంట్స్!

దేశంలో కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఏపీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోదీ అంటుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. 'మోదీ విశ్వగురు కాదు.. విష పురుగు' అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

dfdrerujtu
New Update

YS Sharmila : దేశంలో కుల, మతాల మధ్య చిచ్చుపెడుతూ బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతుందని ఏపీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల అన్నారు. విభజన రాజకీయాలకు తెరలేపుతూ కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా బీజేపీ నిలుస్తుందని ఆమె మండిపడ్డారు. గురవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. ప్రధాని మోదీ తీరు చూస్తుంటే పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుందన్నారు. ఈ మేరకు మత రాజకీయాలకు జన్మస్థలం బీజేపీ. మతాన్ని కవచంలా అడ్డుపెట్టుకుని దేశ సంపదను దర్జాగా దోస్తులకు దోచిపెడుతుందన్నారు. 

విద్వేషాల ఫ్యాక్టరీ..

కాంగ్రెస్ ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోదీ అంటుంటే.. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది. హర్యానాలో బీజేపీ విజయం చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా.. ప్రజల మనసులో బలంగా ప్రేమను నాటాం. ఐక్యత సందేశం క్రమంగా ఉద్యమంగా, ఉప్పెనగా మారుతోందని బీజేపీ తెలుసుకోవాలి. కాంగ్రెస్ మనుషుల్ని, వారి మనసులను గెలిచిందని గ్రహించాలి. నఫ్రత్, మొహబ్బత్ కు మధ్య జరిగిన యుద్ధంలో ప్రేమనే గెలిచింది. జమ్మూకాశ్మీర్ లో తెరుచుకున్న  "మొహబ్బత్ కి దుకాణ్" లు రేపు దేశం మొత్తం తెరుచుకుంటాయి. మోడీ హఠావో..దేశ్ బచావో నిజమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. 

విశ్వగురు కాదు.. విష పురుగు..

ఇక10 ఏళ్లుగా దేశం వెలుగుతుందని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు మోదీ ఆయన విశ్వగురు కాదు.. విష పురుగు అని ప్రజలకు అర్థం అవుతుంది. విద్వేషాన్ని పెంచేది మోదీ.. ప్రేమను పంచేది రాహుల్ అని స్పష్టం అవుతుంది. బీజేపీ, RSS శక్తులు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తుంటే.. కుల, మతాల మధ్య విభజన తెచ్చి ఊచకోత కోస్తుంటే.. ఎదిరించిన గొంతుకలను, నక్సల్స్, టెర్రరిస్టులు, హిందూ వ్యతిరేకులుగా పోల్చుతుంటే.. హక్కుల పరిరక్షణకు, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని దేశం నమ్ముతుంది. ఈ నమ్మకమే 2029లో దేశాన్ని కాంగ్రెస్ నిలబెడుతుంది. ప్రధానిగా రాహుల్ గాంధీని దేశం చూస్తుంది. అన్ని వర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ అందించేది ఆపన్న హస్తం, వాడిపోవటానికి అతి చేరువలో ఉన్నది కమలంమంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

Also Read :  రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ స్టార్‌.. రఫెల్ నాదల్ గుడ్ బై!

#pm-modi #rahul-gandhi #ys-sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe