పవన్‌ కల్యాణ్‌కు బిగ్ షాక్.. మధురైలో కేసు నమోదు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కల్యాణ్‌ అనవసర వ్యాఖ్యలు చేశారంటూ వంజినాథన్‌ అనే న్యాయవాది మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పవన్ పై కేసు నమోదు చేశారు.

New Update

Pawan Kalyan : తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధిపై పవన్ కల్యాణ్‌ అనవసర వ్యాఖ్యలు చేశారంటూ వంజినాథన్‌ అనే న్యాయవాది మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంలో ఉదయనిధికి ఏ మాత్రం సంబంధం లేదని, అయినా పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేశారంటూ మంజినాథన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పవన్ పై కేసు నమోదు చేశారు.

వారంతా తుడిచిపెట్టుకుపోతారంటూ..

ఇదిలా ఉంటే.. ఇప్పటికే సనాతన ధర్మంపై ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య మాటలయుద్ధం మొదలైంది. సనాతన ధర్మం చాలా ప్రమాదమని, దీనిని సమూలంగా నిర్మూలిస్తామని ఉదయనిధిస్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసేందుకు వెనకాడమని పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతి సభలో కౌంటర్ ఇచ్చారు. గురువారం తిరుపతి వారాహి సభలో స్వయంగా ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే ఈపాటికి దేశం తగలబడి పోయి ఉండేదని పవన్ అన్నారు. కానీ, హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. దేవుడి ఆశీస్సులు తీసుకుని చెబుతున్నానని, సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్న సంగతి గుర్తుంచుకోవాలని పవన్ చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ వంటి వారు వస్తారు, పోతారు అని, కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. 

వెయిట్‌ అండ్ సీ..

అలాగే సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారంటూ పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం మరింత చర్చనీయాంశమైంది. దీంతో వెంటనే పవన్‌ కామెంట్స్‌పై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ 'వెయిట్‌ అండ్ సీ' అంటూ కౌంటర్ ఇచ్చారు. 

Also Read :  నానే బియ్యం బతుకమ్మకు నైవేద్యంగా ఏం పెడతారు..?

#pawan-kalyan #andhra-pradesh #tamilnadu #udhayanidhi-stalin
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe