Bengaluru Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీపై ఏపీలో రాజకీయ దుమారం

బెంగళూరు రేవ్‌ పార్టీపై ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ పార్టీలో మంత్రి కాకాణికి సంబంధించిన స్టిక్కర్‌ ఉన్న కారు కనపించడంతో వివాదం మొదలైంది. ఈ పార్టీలో కాకాణి ఉన్నారని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు.

New Update
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి పనులు చేస్తారో తెలుసా?

బెంగళూరు రేవ్‌ పార్టీపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. రేవ్‌ పార్టీ విషయంలో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అయితే రేవ్‌ పార్టీలో కాకాణికి సంబంధించిన స్టిక్కర్‌ ఉన్న కారు కనపించడంతో వివాదం మొదలైంది. కాకాణి ఆ పార్టీలో పాల్గొన్నారని సోమిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.

Also read: మాచర్ల వెళ్లొద్దు.. వారితో మాట్లాడొద్దు: పిన్నెల్లికి హైకోర్టు కండిషన్లు

మరోవైపు రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసింది లోకేష్ అనుచరులే అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పట్టుబడినవారిలో టీడీపీ ఐటీ ఫోరం సభ్యులున్నారని చెబుతున్నారు. ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు అరెస్టు కాగా.. వీళ్లిద్దరూ కూడా టీడీపీ నేతలే అంటూ విమర్శిస్తున్నారు. అయితే సోమిరెడ్డి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడని.. మంత్రి కాకాణి అన్నారు. బెంగళూరు రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కావాలంటే శాంపిల్స్ ఇవ్వడానికి కూడా తాను సిద్ధమని.. దమ్ముంటే సొమిరెడ్డి తన ఛాలెంజ్‌ ను స్వీకరిస్తారా అంటూ సవాలు విసిరారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ రేవ్‌పార్టీ అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది.

Also read: రాగల మూడు రోజులు వానలే వానలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు