Pune: అర్ధరాత్రి పూజా ఖేద్కర్‌ ఇంటికి పోలీసులు.. వివాదంలో కీలక మలుపు

వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి పోలీసులు వెళ్లినట్లు సమాచారం. దాదాపు రెండు గంటల పాటు వారు ఆమెతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

New Update
Pune: అర్ధరాత్రి పూజా ఖేద్కర్‌ ఇంటికి పోలీసులు.. వివాదంలో కీలక మలుపు

Puja Khedkar: సోమవారం రాత్రి 11 గంటలకు ముగ్గురు మహిళా పోలీసుల బృందం పుణెలోని పూజా ఖేద్కర్‌ నివాసానికి వెళ్ళారు. పోలీసులతో ట్రెయినీ ఐఏఎస్‌ ఏం మాట్లాడారన్నది తెలియరాలేదు. కానీ పూజా ఖేద్కరే పోలీసులను ఇంటికి రమ్మని పిలిచిందని.. కేసుకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడిస్తానని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు పూణె కలెక్టర్ సుహాస్ దివాసె తనను వేధిస్తున్నారని పూజా ఖేద్కర్ కంప్లైంట్ చేసింది. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పూజా ఖేద్కర్ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని పూణె కలెక్టర్ సుహాస్ దివాసే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాని తరువాత ఆమెను పూణె నుంచి వాషిమ్‌కు బదిలీ చేశారు. అ్పి నుంచి వార్తల్లో నిలుస్తున్న పూజా ఖేద్కర్‌ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆమె నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్లు ఇటీవల వార్తలు రాగా.. ఇప్పుడు మరో విషయం బయటికొచ్చింది. సివిల్స్‌ పరీక్షకు ఆమె వేర్వేరు పేర్లతో హాజరైనట్లు సమాచారం. 2019లో ఖేద్కర్‌ పూజా దిలీప్‌రావు అనే పేరుతో ప్రిలిమ్స్‌ రాయగా.. 2022లో పూజా మనోరమ దిలీప్‌ ఖేద్కర్‌ పేరుతో హాజరయ్యారట. రెండోసారి రాసిన పరీక్షలోనే ఆమె ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అటు సెంట్రల్‌ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌కు చేసుకున్న దరఖాస్తుల్లోనూ తన వయసును వేర్వేరుగా పేర్కొనడం గమనార్హం.

Also Read:Movies: ఫిల్మ్ ఫేర్ అవార్డుల కోసం పోటీ పడుతున్న తెలుగు సినిమాలు ఇవే..

Advertisment
తాజా కథనాలు