MP Murder: ఎంపీ దారుణ హత్య.. చర్మం ఒలిచి.. పసుపు పూసి.. ఇంత ఘోరమా! బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంపీ ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఒక మహిళను ఎర వేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Bhavana 24 May 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Bangladesh MP Anwarul Azim Murder: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంపీ ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఒక మహిళను ఎర వేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సీసీటీవీ ఫుటేజీలో అన్వరుల్ అమెరికాలో నివసించే మిత్రుడు అద్దెకు తీసుకున్న న్యూ టౌన్ ఫ్లాట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి లోపలికి వెళ్ళిన ఆయన తిరిగి రాలేదు. అయితే మహిళ కావాలనే బంగ్లాదేశ్ ఎంపీని ఆ ఫ్లాట్‌కు తీసుకువెళ్లాలని కోరిందని, ఆయన లోపలికి వెళ్లిన వెంటనే హత్య చేసి ఉంటారని సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు. అన్వరుల్ హనీ ట్రాప్‌లో పడినట్లుగా స్పష్టంగా తెలుస్తుందని అధికారులు వివరించారు. చనిపోయిన వ్యక్తి మిత్రుడికి ఆ మహిళ కూడా బాగా పరిచయస్తురాలే. ఈ కేసులో హనీట్రాప్ కోణంతో పాటు, హత్యలో అమెరికా పౌరుడి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి సుమారు రూ.5 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో గురువారం ముంబైకి చెందిన ఓ వ్యక్తని అదుపులోకి తీసుకున్నారు. Also Read: పేటీఎం నుంచి 6, 300 మంది ఉద్యోగుల తొలగింపు! ఇతను ఈ హత్యలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. మొదటగా ఎంపీని గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత, ఆయన శరీరాన్ని ముక్కలుగా నరికి ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేశారు. తరువాత మాంసం కుళ్ళిపోకుండా ఉండటానికి శరీర భాగాలకు పసుపుని రాసి, మరికొన్నింటిని ఫ్రిజ్‌లో ఉంచారు. తరువాత శరీర భాగాలను ట్రాలీ బ్యాగ్‌లో ఉంచి, వేర్వేరు ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడేశారని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఫ్లాట్‌లో రక్తపు మరకలు, శరీర భాగాల తాలుకు గుర్తులను పోలీసులు గుర్తించారు. వైద్య చికిత్స కోసం మే 12న కోల్‌కతా వచ్చిన ఆయన స్నేహితుడు బిశ్వాస్ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత రోజు మధ్యాహ్నం నివాసం నుండి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దీంతో ఆయన కోసం గాలించగా తాజాగా హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. #mp #bangladesh #kolkata #murder #anwarul మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి