Lok Sabha Elections : ఎన్నికల వేళ.. ఆ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో బాలానగర్ వద్ద ఓ లారీలో భారీగా మద్యం పట్టుబడింది. ఆ మద్యం బాటిళ్ల విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు.

New Update
Lok Sabha Elections : ఎన్నికల వేళ.. ఆ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం

Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం(Election Campaign) గడవు నేటితో ముగియనుంది. దీంతో పార్టీల నేతలు ఓటర్ల(Voters) ను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం(Election Commission) అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. ఓ లారీ అక్రమంగా భారీ మొత్తంలో మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం..

అందులో ఉన్న మద్యం బాటిళ్లను(Liquor Bottles) చూసి అధికారులు షాకైపోయారు. వెంటనే ఆ వాహనాన్ని సీజ్‌ చేశారు. ఆ మద్యం బాటిళ్ల విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు.

Also read: ఒడిశాలో మోదీ పర్యటన..కాషాయమయం అయిన రోడ్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు