Accident : ఎన్నికల(Elections) వేళ పలు ప్రాంతాల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. అధికారుల కంటపడకుండా పుష్ప(Pushpa) సినిమా స్టైల్‌లో వాహనాల్లో డబ్బులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి(East Godavari) జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. డ్రైవర, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా.. వ్యాన్ అడుగు భాగంలో 7 బాక్స్‌లు ఉన్నాయి. అందులో చూస్తే భారీగా నగదు లభించింది. వీటి విలువ దాదాపు రూ.7 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
Also read: తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం..
అయితే ఆ డబ్బు ఏ పార్టీకి చెందినది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్(Polling) జరగనున్న వేళ.. భారీగా మద్యం, నగదు పట్టుబడుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Also Read: కుప్పంలో ఉద్రిక్తత..వైసీపీ, టీడీపీల మధ్య గొడవ