Accident : ఎన్నికల(Elections) వేళ పలు ప్రాంతాల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. అధికారుల కంటపడకుండా పుష్ప(Pushpa) సినిమా స్టైల్లో వాహనాల్లో డబ్బులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి(East Godavari) జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. డ్రైవర, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా.. వ్యాన్ అడుగు భాగంలో 7 బాక్స్‌లు ఉన్నాయి. అందులో చూస్తే భారీగా నగదు లభించింది. వీటి విలువ దాదాపు రూ.7 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : యాక్సిడెంట్ అయ్యింది.. తీరాచూస్తే వ్యాన్‌లో రూ.7 కోట్లు లభ్యం
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై కెమికల్ బస్తాలతో వెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యాన్ కింద ఉన్న అరలో దాదాపు రూ.7 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: