HYD Ganja : శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. సినిమా తరహాలో కంటైనర్‌ను వెంబడించారు పోలీసులు. కంటైనర్‌లో 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.8కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు.

New Update
HYD Ganja : శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత

Ganja Seized In Shamshabad : హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్‌లో భారీగా గంజాయి (Ganja) పట్టుకున్నారు పోలీసులు. సినిమా తరహాలో కంటైనర్‌ను వెంబడించారు పోలీసులు. కంటైనర్‌లో 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా (Odisha) నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేశారు SOT పోలీసులు. పెద్ద గోల్కొండ దగ్గర గంజాయి పట్టుకున్నట్లు SOT డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గంజాయి విలువ రూ.2.80 కోట్లుగా ఉంటుందని చెప్పారు. కీలక నిందితుడు రామును అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర (Maharashtra) కు చెందిన మారుతి పటేల్‌ పరారీలో ఉన్నాడని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Also Read : అమెరికాలో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు