Andhra Pradesh : పిఠాపురంలో భారీగా ఎన్నికల సామాగ్రి పట్టివేత

నిన్న అర్ధరాత్రి కాకినాడ జిల్లా పిఠాపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎలాంటి అనుమతి లేకుండా కాకినాడ నుంచి తునివైపుకు వెళుతున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నారు. ఇందులో భారీగా ఎన్నికల ప్రచార సామాగ్రిని పట్టుకున్నారు.

New Update
Andhra Pradesh : పిఠాపురంలో భారీగా ఎన్నికల సామాగ్రి పట్టివేత

Pithapuram : నిన్న రాత్రి పిఠాపురం(Pithapuram) లో దొరికిన బొలేరో వాహనాన్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఇందులో వైసీపీ(YCP) కి సంబంధించిన ఎన్నికల ప్రచార సామాగ్రి భారీగా ఉండడంతో వాభనాన్ని వెంటనే సీజ్ చేశారు. కాకినాడ(Kakinada) నుంచి తునివైపుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ వాహనం ప్రయాణిస్తోందని పోలీసులు అంటున్నారు. వ్యాన్‌లో ప్రచార సామాగ్రి(Promotional Materials) తో పాటూ డమ్మీ ఈవీఎం(Duplicate EVM's) లు కూడా ఉండడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఇంకా ఇందులో భారీ మొత్తంలో జగన్ మాస్కులు, టోపీలు, జెండాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాన్ని పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌కు అధికారులు తరలించారు.

హాడావుడి చేసిన టీడీపీ నేత వర్మ..

బోలెరో వాహనం గురించి తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కాసేపు హడావుడి చేశారు. పవన్‌కళ్యాణ్ పోటీ చేయడంవ ల్లనే భారీ మొత్తంలో నగదు పిఠాపురానికి వస్తోందని వర్మ ఆరోపించారు. ప్రచార సామాగ్రిని ముందుగా పంపించి.. పక్క రూట్ నుంచి నగదు పంపిస్తున్నారని అంటున్నారు. మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీతకు.. నగదు పంపిస్తున్నారని వర్మ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనం పట్టుబడ్డా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...దానికి కూడా ఇదే కారణం అని ఆరోపిస్తున్నారు.

Also Read : IPL-2024: ఒకే ఒక్కడు..అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్న కోహ్లీ

Advertisment
Advertisment
తాజా కథనాలు