Telangana Elections: పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో రూ.11 కోట్లు స్వాధీనం.. ఎవరివంటే..

తెలంగాణలో ఎన్నికల వేళ పలు ప్రాంతాల్లో నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో రూ.11 కోట్ల నగదును పోలీసులు, ఈసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చెందినవారిగా పోలీసులు భావిస్తున్నారు.

New Update
TS elections 2023: బాబోయ్.. ఎన్నికల వేళ రోడ్లపైకి నోట్ల కట్టలు.. ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

తెలంగాణలో మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీల నేతల ప్రచారాలతో బిజీబీజీగా గడుపుతున్నారు. అధికారం దక్కించుకోవడం ఎంతైన ఖర్చులు పెట్టేందుకు వెనక్కి తగ్గడం లేదు. అయితే పోలీసులు, ఈసీ అధికారులు చెపడుతున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో ఏకంగా రూ.11 కోట్లకు పైగా నగదు పట్టుపడింది. ఖమ్మం జిల్లాలో అధికారులు రెండు చోట్ల భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ముత్తగూడెంలో రూ.6 కోట్లు, పాలేరులో రూ.3.5 కోట్ల నగదను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన డబ్బులని అధికారులు భావిస్తున్నారు.

Also read: అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్‌ రావు ఫైర్..

మరోవైపు పెద్ద జిల్లా రామగుండంలో రూ.2 కోట్ల 18 లక్షలు పట్టుబడింది ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో కాంగ్రెస్‌ సంబంధిత ప్రచార కార్యాలయంలో నిల్వచేసిన ఈ నగదును SAT, ఎలక్షన్ స్క్వాడ్ ఈ డబ్బులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబట్ట ఈ డబ్బులు కూడా రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందినవని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నవంబర్‌ 30న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. నవంబర్‌ 28 సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. ఇక డిసెంబర్‌ 3 న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజున మిగతా నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది.

Also Read: కాంగ్రెస్‌ నేతలే వెంటపడి రైతుబంధు ఆపివేయించారు: కవిత

Advertisment
తాజా కథనాలు