జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు మరోసారి ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. కుల్గాం అనే జిల్లాలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. దీంతో భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనలో మన జవాన్లు.. ఐదుగురు ఉగ్రవాదులను హతం చేశారు. మృతిచెందినవారు లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కుల్గాం జిల్లాలోని సామ్నో అనే ప్రాంతంలో.. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో గురువారం రాత్రి స్థానికంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఈ క్రమంలోనే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. అయితే చీకటి పడటం వల్ల ఈ ఆపరేషన్‌కు విరామం ఇచ్చారు. మళ్లీ రెండో రోజు తెల్లవారుజామున ఇరుపక్షాల మధ్య మళ్లీ కాల్పులు జరిగాయి.
Also read: కంపు ఉండదు.. పొలూష్యన్ ఉండదు.. కారులో గాల్లోనే ఎగిరిపోవచ్చు..!
దాదాపు 18 గంటల పాటు ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్‌కౌంటర్లో అయిదురు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. అయితే కాల్పుల వల్ల ఉగ్రవాదులు దాక్కుని ఉన్న ఇల్లు మంటలో కాలిపోయిందని.. దీంతో వాళ్లందరూ బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న పూంచ్ జిల్లాలో అనుమానస్పద కదలికలు కనిపించడంతో.. భద్రతాసిబ్బంది భద్రతాసిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేసింది. అంతకుముందు ఉరీ సెక్టార్‌లో ఉన్నటువంటి కీలక ఉగ్రవాది అయిన బషీర్ అహ్మద్‌ను బలగాలు హతం చేసిన సంగతి తెలిసిందే. ఇక సరిహద్దు వెంట.. సైనికులు, జమ్మూ కశ్మీర్ పోలీసులు 'ఆపరేషన్ కాళీ' అనే పేరుతో చేపట్టిన చర్యలో బషీర్ అహ్మద్‌తో పాటు మరో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారలు పేర్కొన్నారు.
Also read: PM Modi: డీప్‌ఫేక్ వీడియోలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..