Telangana: బిల్డర్ మధు శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు.. కేసులో బయటపడ్డ సంచలన నిజాలు హైదరాబాద్ బిల్డర్ మధు శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అతని వద్ద ఉన్న రూ.5 లక్షల నగదు, ఒంటిపై ఉన్న రూ.20 లక్షల విలువైన బంగారం మాయమయ్యాయి. అతని డ్రైవర్ రేణుక దొరికితే ఈ కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. By B Aravind 27 May 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Quthbullapur Builder Madhu Incident: హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. మధు శరీరంపై 30కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు బండరాయితో దారుణంగా కొట్టి హత్య చేశారు. మే 24న ఉదయం డ్రైవర్ రేణుకతో పాటు మరో ఇద్దరితో కలిసి మధు బీదర్ వెళ్లాడు. ఇంటికి వస్తున్నానని భార్యతో చెప్పిన గంటకి మధుతో పాటు డ్రైవర్ ఫోన్ స్విచాఫ్ వచ్చింది. మరో ఇద్దరి ఫోన్లు కూడా స్విచాఫ్ వచ్చాయి. మధు వద్ద ఉన్న రూ.5 లక్షల నగదు, ఒంటిపై ఉన్న రూ.20 లక్షల విలువైన బంగారం మాయమైనట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆయన్ని డబ్బులు, బంగారం కోసమే హత్య చేశారా లేదా పాత కక్షలేమైన ఉన్నాయా అనే దానిపై విచారణ కొనసాగుతోంది. చాలా ఏళ్లుగా డ్రైవర్ రేణుక.. మధు దగ్గరే పనిచేస్తోంది. పరారీలో ఉన్న డ్రైవర్ రేణుక దొరికితే ఈ కేసుకి సంబంధించిన అన్ని విషయాలు బయటపడతాయని బీదర్ పోలీసులు చెబుతున్నారు. Also Read: బ్యాంకు ఖాతా నుంచి ఆధార్ కార్డు వరకు జూన్ 1 నుంచి మార్పులు చేపట్టిన కేంద్రప్రభుత్వం.. #telugu-news #murder #crime-news #builder-madhu-murder-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి