Bengaluru Rave Party: రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. బెంగళూరులోనే హేమ

బెంగళూరు రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 30 మంది యువతులు,71 మంది పురుషులు ఉన్నారు. బెంగళూరు పీఎస్‌కు వెళ్లిన మెడికల్‌ టీమ్స్ అందరి దగ్గర బ్లడ్‌ శ్యాంపుల్స్ సేకరిస్తున్నాయి. నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పీఎస్‌లోనే ఉన్నారు.

New Update
Bengaluru Rave Party: రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. బెంగళూరులోనే హేమ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. మొత్తం ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నారు. ఇప్పటికే బెంగళూరు పోలీస్‌ స్టేషన్‌కు మెడికల్‌ టీమ్స్ వెళ్లి అందరి దగ్గర బ్లడ్‌ శ్యాంపుల్స్ సేకరిస్తున్నాయి. ఈ కేసులో నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురు అరెస్టయ్యారు. నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పీఎస్‌లోనే ఉన్నారు.

Also read: డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వారికి గుడ్‌న్యూస్..

అయితే ఉదయం.. హేమ తాను రేవు పార్టీలో లేనని.. హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత ఆమె బెంగళూరులోనే ఉండి ఆ వీడియో షూట్ చేసిందని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. హేమ ప్రజలను తప్పుదోవ పట్టించిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇలా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు హేమపై మరో కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ పార్టీలో నటుడు శ్రీకాంత్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన శ్రీకాంత్.. రేవ్ పార్టీలో పాల్గొనలేన్నారు. హైదరాబాద్‌లోనే తన ఇంట్లో ఉన్నానని స్పష్టం చేశారు.

Also Read: బీజేపీలో నాకు జరిగిన అవమానం ఇదే: జితేందర్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు