Praneeth Rao : తెలంగాణ(Telangana) లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం(Phone Tapping) ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర నిఘా విభాగంలోని స్పెషల్ ఇంటిలెజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావు(Praneeth Rao) ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రతిపక్ష నేతలు, కీలక అధికారులతో పాటు వారి బంధువుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రణీత్ రావును 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు.
ఈ క్రమంలోనే ఈ కేసులో రోజుకో కొత్త వ్యవహారం వెలుగులోకి వస్తుంది. తాజాగా ప్రణీత్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. బీఆర్‌ఎస్ (BRS) నేత రాత్రికి రాత్రే 100 మంది నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమనడం, వాటిని అన్నిటిని కూడా ప్రణీత్ ట్యాప్ చేయడం జరిగింది. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి మీద వీరు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.
ఆయనను ఎవరెవరు ఎప్పెడెప్పుడూ కలుస్తున్నారు అనే దాని మీద సదరు బీఆర్‌ఎస్ నేత ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. బీఆర్‌ఎస్ నేత ఆదేశాలతో ఆ వివరాలన్నిటిని కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేసి సదరు నేతకు చేరవేశాడు. డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రణీత్ ఎప్పటికప్పుడు టీఆర్‌ఎస్ నేతకు చేరవేసేవాడు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy) తో పాటు ఆయన అనుచరులతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. రేవంత్ అన్నదమ్ముల ఫోన్లన కూడా ప్రనీత్ రావు ట్యాప్ చేశాడు. కొందరు మీడియా పెద్దలను కూడా ప్రణీత్ వదల్లేదని తెలుస్తుంది. ప్రణీత్ రావును కస్టడీకి ఇవ్వాని ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పోలీసులు.
Also Read : మమతా బెనర్జీ ని వెనక నుంచి ఎవరో తోసేసి ఉండొచ్చు!