Janasena: కక్ష సాధింపేనా? జనసేన సిబ్బంది నివసించే అపార్ట్‌మెంట్లలో పోలీసుల తనిఖీలు! మంగళగిరిలో పవన్ సెక్యూరిటీ, కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ప్లాట్‌లలో పోలీసులు తనిఖీల చేయడాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. రాత్రి 10 గంటలకు పోలీసులకు రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకొని అక్కడికి వచ్చారో చెప్పాలన్నారు. By Trinath 07 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Police Raids On Janasena Staff: ఏపీలో ఎలక్షన్ హీట్ బయట ఎండలను తలపిస్తోంది. రోజులు పెరుగుతున్న కొద్దీ హీట్ అంతకంతకూ పెరుగుతోంది. మంగళగిరిలో జనసేన (Janasena) సిబ్బంది నివసించే అపార్ట్‌మెంట్లకు పోలీసులు వెళ్లడం ఇరు పార్టీల మధ్య అగ్గికి రాజేసింది. కారణం తెలియచేయకుండా జనసేన సిబ్బంది గదులను పోలీసులు తనిఖీ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏయే గదుల్లో ఎవరు ఉంటున్నారని పోలీసులు అడిగినట్టు సమాచారం. ప్రభుత్వం కుట్రలతో పోలీసులును అడ్డం పెట్టి నీచ రాజకీయాలు చేస్తుందంటూ జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన కార్యాలయంలో పని చేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా అపార్ట్మెంట్‌కు అద్దె చెల్లిస్తున్నారు పవన్. పవన్ సెక్యూరిటీ, కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ప్లాట్ లలో పోలీసులు తనిఖీలపై అటు టీడీపీ (TDP) నేతలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పందించిన నాదెండ్ల: జరుగుతున్న పరిణామాలపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పందించారు. మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీకి పని చేసే సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్లో పోలీసులు సోదాలు చేయడం కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. వారి గదుల్లోకి వెళ్ళి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని విమర్శించారు. ఈ తీరు చూస్తే కచ్చితంగా పోలీసులను ఉపయోగించి సిబ్బందిని, జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. రాత్రి 10 గంటలకు పోలీసులకు రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకొని అక్కడికి వచ్చారో చెప్పాలన్నారు నాదెండ్ల మనోహర్. ఆందోళనకు పిలుపునిస్తాం: వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు పావులుగా మారడం అప్రజాస్వామికమని చెప్పారు నాదెండ్ల మనోహర్. ఈ చర్యలను (Police Raids) ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలపై తమ మిత్ర పక్షాలైన తెలుగుదేశం, బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని తెలిపారు. Also Read: ఏపీ మహిళలకు శుభవార్త.. నేడే అకౌంట్లో రూ.18,750 ! #pawan-kalyan #ycp #ap-elections-2024 #janasena #mangalagiri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి