/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kadapa-jpg.webp)
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కూతరు కనిపించడం లేదని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. తన కొరిక తీర్చాలని ఓ హెడ్ కానిస్టేబుల్ అడగడం కలకలం రేపింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదావాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడుకు ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ఉంటుంది. అయితే తన కూతురు ఇటీవలే ఓ యువకుడ్ని పెళ్లి చేసుకొని కనిపించకుండా పోయింది. ఎంత వెతికిన తన కూతురు ఆచూకి దొరకకపోవడంతో.. చివరికి ఆ మహిళ ఓబులవారిపల్లె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పరారైన ఆ మైనర్ బాలికను వెతికి పెట్టే బాధ్యతను ఎస్‌ఐ ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు అప్పగించాడు.
Also Read: రాజకీయ కార్యక్రమాలకు సిద్ధమవుతున్న చంద్రబాబు.. ఈరోజు ఆయన వెళ్లేది అక్కడికే..
అయితే దీన్ని అవకాశంగా భావించిన ఆ హెడ్ కానిస్టేబుల్ తన వక్ర బుద్ధిని చూపించుకున్నాడు. తన కొరిక తీర్చాలంటూ ఓ మహిళా కానిస్టేబుల్ సహకారంతో ఆ మహిళను వేధించాడు. దీంతో ఆ మహిళ చివరికి ఓ వీడియోను విడుదల చేసింది. అందులో హెడ్‌కానిస్టేబుల్ తనని కోరిక తీర్చాలని, నగ్నంగా ఉండాలని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.