/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-41-3-jpg.webp)
Bigg Boss Telugu: బిగ్‌బాస్ షో నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల షో ఫైనల్ అనంతరం జరిగిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా పలువురు కంటెస్టెంట్ల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుపైనా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) అభిమానులు దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ గొడవలపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు ఆదేశించారు. కాగా, ఆయా ఘటనలపై విన్నర్ పల్లవి ప్రశాంత్ సహా పలువురిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి, అనంతరం ప్రశాంత్ బెయిల్ పై విడుదలయ్యారు.