డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్!.. స్పందించిన నటి
రేవ్ పార్టీలో డ్రగ్స్, లిక్కర్ వాడుతున్నారని ఆరోపణలతో తనను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తలపై బిగ్ బాస్ ఫేమ్, నటి హిమజ స్పందించారు. తాను రేవ్ పార్టీ ఇచ్చింది వాస్తవమేనని.. కానీ, అందులో ఎలాంటి డ్రగ్స్ వాడలేదని తేల్చి చెప్పింది. తాను అరెస్ట్ కాలేదని వెల్లడించింది.