CM Ramesh : సీఎం రేమేష్‌కు షాక్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు .. సెక్షన్ 41ఏ అమలు చేసిన పోలీసులు

అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌కు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ చెల్లించకుండా.. అనధికారంగా టైల్స్ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు చేస్తుండగా.. డీఆర్‌ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. .

New Update
CM Ramesh: వైసీపీలో వీళ్లు తప్ప ఎవరూ మిగలరు.. సీఎం రమేష్ హాట్ కామెంట్స్

Police Issued Notice : ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లోని అనకాపల్లి పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ(BJP) నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్‌(CM Ramesh) కు షాక్ తగిలింది. డీఆర్‌ఐ (DRI) విధుకులకు ఆటంకం కలిగించడంతో.. ఆయనకు శనివారం రాత్రి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. FIRలో సీఎం రమేష్‌, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజుతో సహా ఆరుగురి పేర్లను చేర్చారు. దీంతో ఈ నెల తొమ్మిదో తేదీన విచారణకు హాజరుకావాలని అనకాపల్లి ఎస్‌డీపీవో ఆదేశించారు.

Also Read: తడు నయ వంచనకు నిలువెత్తు నిదర్శనం: కృపారాణి

ఇదిలాఉండగా.. చోడవరంలోని ఓ ఘటనలో సీఎం రమేష్‌పై కేసు నమోదు కావడంతో.. శనివారం నర్సీపట్నంలో కృష్ణా ప్యాలెస్‌లో బీజేపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఇందులో కార్యకర్తలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఇది వివాదానికి దారి తీసింది. సమాచారం మేరకు నర్సీపట్నం టౌన్ సీఐ క్రాంతి కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబుతో పాటు ఎన్నికల యంత్రాంగం అక్కడికి చేరుకున్నారు. దీంతో సీఎం రమేష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటర్లకు తమ పార్టీ సింబల్ తెలియజేసేందుకు కమలం గుర్తు కలిగిన చీరలు ఇవ్వడం తప్పా అంటూ ప్రశ్నించారు. ఇవి తాయిళాలు కాదంటూ అధికారులపైనే మండిపడ్డారు.

అయితే చోడవరంలో జీఎస్టీ(GST) చెల్లించకుండా.. అనధికారంగా టైల్స్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలతో బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు చేస్తుండగా.. డీఆర్‌ఐ అధికారులపై దాడికి దిగడం, విధులకు ఆటంకం కలిగించినందుకు శనివారం రాత్రి సీఎం రమేష్‌కు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు.

Also Read: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కాపు నాయకులు..!

Advertisment
తాజా కథనాలు