Hyderabad: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. స్నాచింగ్ ముఠాపై పోలీసుల ఫైరింగ్

శుక్రవారం రాత్రి కాల్పులతో హైదరాబాద్ నగరం దద్ధరిల్లింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో నరగవాసులు హడలిపోయారు. ఏం జరుగుతోందో తెలియక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికారు. హైదరాబాద్ చిలకలగూడలో సెల్‌ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

Hyderabad: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. స్నాచింగ్ ముఠాపై పోలీసుల ఫైరింగ్
New Update

Hyderabad: నగరంలో ఒకవైపు హత్యలు, ఆత్మహత్యలు.. మరోవైపు స్నాచింగ్ ముఠాలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. వరుస హత్యలతో భాగ్యనగరం అట్టుడుకుతుంటే మరోవైపు దొంగల ముఠాలు హడలెత్తిస్తున్నాయి. శుక్రవారం రాత్రి దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు చేసిన కాల్పులతో నగరంలో భయాందోళన వాతావరణం నెలకొంది. దీంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎటునుంచి ఏం ప్రమాదం ముచుకొస్తుందో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతంలో చోటుచేసుకుంది. సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిగి ఘటన చోటుచేసుకుంది.

శుక్రవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో.. యాంటీ డెకాయిట్ టీం మెట్టుగూడ ప్రాంతంలో సర్ప్రైజ్ ఆపరేషన్‌లో భాగంగా ఫుట్‌పాత్‌పై టీంలోని వ్యక్తి సేదతీరాడు. అయితే అక్కడకు ముగ్గురు దుండగులు వచ్చారు. దీంతో ఆ వ్యక్తికి మెలకువ రావడంతో అలర్ట్ అయ్యాడు. సెల్ ఫోన్ దొంగలించడానికి ప్రయత్నం చేసిన వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి అరుపులకు యాంటీ డెకాయిట్ టీం అలర్ట్ అయ్యింది. ముగ్గురు దుండగులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో యాంటీ డెకాయిట్ టీంకు నలుగురి మధ్య తోపులాట జరిగింది. దీంతో సెల్‌ ఫోన్‌ దొంగలను బెదిరించడానికి డెకాయిట్ టీమ్ సభ్యుడు ఒకరు రివాల్వర్ బయటకు తీశాడు. వీరి మధ్య తోపులాటలో గన్‌ మిస్ ఫైర్ అయ్యిందని పోలీసులు చెబుతున్నారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. దీంతో దుండగలు భయంతో అక్కడి నుంచి పరార్‌ అయ్యారు. అయితే వారిని వెంబడించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:T20 World Cup: టీ 20 వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్

#hyderabad #theif #police #firing
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe