Amit Shah : అమిత్‌ షాపై కేసు నమోదు.. ఏ3గా చేర్చిన పోలీసులు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మొఘల్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదైంది. పోలీసులు ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమిత్‌ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు.

New Update
Amit Shah : అమిత్‌ షాపై కేసు నమోదు.. ఏ3గా చేర్చిన పోలీసులు

Case Against Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పై ఎన్నికల కోడ్‌(Election Code) ఉల్లంఘన కేసు నమోదైంది. హైదరాబాద్‌(Hyderabad) లోని మొఘల్‌పురా పోలీస్‌ స్టేషన్‌లో సెక్షన్‌ 188 కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. అమిత్‌ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాలని హైదరాబాద్‌ సీపీకి ఎన్నికల సంఘం ఆదేశించింది.

Also Read: కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై విచారిస్తాం: సుప్రీంకోర్టు

ఇక వివరాల్లోకి వెళ్తే మే1న హైదరాబాద్‌లోని పాతబస్తీ పర్యటన సందర్భంగా.. అమిత్‌ షా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని కాంగ్రెస్(Congress) పీసీసీ వైస్ ప్రెసిజెంట్ జి.నిరంజన్ ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవిలత, అమిత్‌ షా, కిషన్‌ రెడ్డి, రాజాసింగ్‌లు ఎన్నికల నియమాలు పట్టించుకోకుండా.. చిన్నారులతో ప్రచారం చేయించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మొఘల్‌పురా పీఎస్‌లో వీళ్లపై కేసు నమోదైంది. A1గా యమాన్ సింగ్, A2 ఎంపీ అభ్యర్థి మాధవి లత, A3 అమిత్ షా, A4 కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, A5 ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్లను పోలీసులు చేర్చారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఎన్నికల సంఘం.. హైదరాబాద్‌ సీపీకి ఆదేశించింది.

Advertisment
తాజా కథనాలు