Case Filed Against Navneet Kour: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ షాద్‌నగర్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పాకిస్థాన్‌కు ఏటు వేసినట్లేనని నవనీత్ కౌర్ అన్నారు. దీంతో విద్వేష ప్రసంగం చేశారంటూ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదైంది. ఇదిలాఉండగా.. మే 8న హైదరాబాద్‌లో ఎంపీ అభ్యర్థి మాదవిలతకు మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్ ఓవైసీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: మద్యం కేసులో మరో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో ‘ఆప్’ పేరును చేర్చనున్న ఈడీ
2012లో అక్బరుద్దీన్ ఓవైసీ.. పోలీసులు15 నిముషాలు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని అన్నారు. దీన్ని ప్రస్తావించిన నవనీత్ కౌర్.. మీరు 15 నిముషాలు అంటున్నారుకదా.. పోలీసులు తప్పుకుంటే మాకు కేవలం 15 సెకన్లు చాలు.. ఏం జరుగుతుందో మీ బ్రదర్స్ ఊహించలేరంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆమె వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. ‘మోదీజీకి చెబుతున్నా.. ఆమెకు 15 సెకన్లు కాదు గంట సమయం ఇస్తున్నాం.. ఆ ఏం చేస్తారో? మీలో మానవత్వం మిగిలి ఉందా లేదా అనేది చూడాలనుకుంటున్నాం. ఎవరూ భయపడరు ఇక్కడ? మేము సిద్ధంగా ఉన్నామని' అన్నారు.
Also Read: కేటీఆర్ రాళ్ల దాటి ఘటన.. 23 మంది అరెస్టు