TGRTC: TGSRTC ఫేక్‌ లోగో వైరల్‌.. ఇద్దరిపై కేసు నమోదు

TGSRTC పేరుతో ఓ కొత్త లోగో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చిక్కడపల్లి పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. జిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై, అలాగే మరోవ్యక్తి హరీష్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

TGRTC: TGSRTC ఫేక్‌ లోగో వైరల్‌.. ఇద్దరిపై కేసు నమోదు
New Update

TSRTCని.. TGSRTC గా మారుస్తున్నట్లు ఆర్డీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత TGSRTC పేరుతో ఓ కొత్త లోగో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పేరు మాత్రమే మార్చామని.. లోగో కాదని ఆర్టీసీ సంస్థ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫేక్ లోగోను వైరల్ చేసిన వారికి పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై, అలాగే మరోవ్యక్తి హరీష్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశం

అయితే లోగోను తామే తయారు చేసి.. తమపై తప్పుడు కేసు పెట్టారని దిలిప్ ఆరోపించారు. ఉద్యమంలో అన్నీ ఎదుర్కొని వచ్చిన తమపై ఇలాంటి కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తే.. ప్రజాగ్రహానికి గురవుతారంటూ హెచ్చరించారు.

Also Read: ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట.. హైకోర్టు కీలక ఆదేశం

#telugu-news #telangana-news #tgsrtc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe