Andhra Pradesh: టీడీపీ ఆఫీస్‌పై దాడి.. 10 మంది వైసీపీ నేతలు అరెస్టు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మంది వైసీపీ నేతల్ని గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. By B Aravind 09 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి TDP Office Attack Case: టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ షురూ చశారు. 10 మంది వైసీపీ నేతల్ని గన్నవరం పోలీసులు (Gannavaram Office) అరెస్టు చేశారు. డొక్కు సాంబశివ వెంకన్న, పడమట నాగరాజు, నగేష్, మూల్పూరి ప్రభుకాంత్‌తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డ్రైవర్ దుర్గారావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కూడా అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా.. వైసీపీ హయాంలో 2021 అక్టోబర్ 19న తాడేపల్లిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూకలుగా వచ్చి కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాత కేసులను వెలికితీస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై చర్యలు తీసుకుంటోంది. Also Read: రూ.500, 200 నోట్ల రద్దు.. హింట్ ఇచ్చేసిన చంద్రబాబు! #telugu-news #ysrcp #tdp #tdp-office మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి