Rashmika Deepfake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడిని.. అరెస్ట్ చేసిన పోలీసులు

రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఈ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ లో పట్టుకున్నట్లు సమాచారం. బ్రిటీష్ మోడల్ కు రష్మిక పేస్ పెట్టి డీప్ ఫేక్ చేశారు.

Rashmika Deepfake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడిని.. అరెస్ట్ చేసిన పోలీసులు
New Update

Rashmika Deepfake Video: ఇటీవలే  కాలంలో డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అన్నిటికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచిన డీప్ ఫేక్ ఘటన నటి రష్మికకు సంబంధించినది. రష్మిక డీప్ ఫేక్ పై అటు సోషల్ మీడియాతో పాటు ఇటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ దుమారం కొనసాగుతుండగానే మరికొందరి సెలబ్రేటీల డీప్ ఫేక్ వీడియోలు కూడా బయటకు రావడం సంచలనం రేపింది. ఈ డీప్ ఫేక్ వీడియోల పట్ల పలువురు సెలెబ్రెటీలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా రష్మిక డీప్ ఫేక్ తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లో పట్టుకున్నట్లు తెలిసిందే. బ్రిటీష్ ఇండియన్ మోడల్ జరాపటేల్ (Zara Patel) మొహానికి.. రష్మిక ఫేస్ పెట్టి డీప్ ఫేక్ క్రియేట్ చేశారు. దీని పై ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 465 ఫోర్జరీ, 469 పరువు హాని కలిగించడం, 66c ఐడెంటిటీ థెఫ్ట్, 66 E గోప్యత ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

Also Read: రాముడిగా రణ్ బీర్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్.. మరో సారి కాంబో రిపీట్

ఈ డీప్ ఫేక్ వీడియోలో రష్మిక డీప్ నేక్ బ్లాక్ డ్రెస్ లో కనిపించారు. మొదట్లో ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు.. రష్మికదేనని షాకయ్యారు. కానీ ఇది AI మార్ఫింగ్ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అని తేలడంతో సామాన్యుల నుంచి సెలెబ్రెటీల వరకు.. ఇలా చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక చివరకు డీప్ ఫేక్ కు పాల్పడ్డడాని భావిస్తున్న ఓ వ్యక్తిని ఏపీలో పట్టుకున్నారు.

🚨 There is an urgent need for a legal and regulatory framework to deal with deepfake in India.

You might have seen this viral video of actress Rashmika Mandanna on Instagram. But wait, this is a deepfake video of Zara Patel.

This thread contains the actual video. (1/3) pic.twitter.com/SidP1Xa4sT

— Abhishek (@AbhishekSay) November 5, 2023

Also Read: Varun Tej Matka: మెగా హీరో “మట్కా”… వరుణ్ తేజ్ మాస్ లుక్.. మామూలుగా లేదు..!

#rashmika-mandanna #rashmika-deep-fakevideo
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe