Varun Tej Matka: మెగా హీరో "మట్కా"... వరుణ్ తేజ్ మాస్ లుక్.. మామూలుగా లేదు..! మెగా హీరో వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా.. ఆయన లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ రిలీజైన ఈ వీడియోలో వరుణ్ తేజ్ మాస్ లుక్ లో కనిపించారు . ఈ చిత్రం కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. By Archana 20 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Varun Tej Matka: ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన గని, గాండీవధారి అర్జున సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు 2024 లో రాబోతున్న ఆపరేషన్ వాలెంటైన్, మట్కా విజయాలు మెగా హీరోకు కీలకంగా మారాయి. మట్కా ఫస్ట్ లుక్ వీడియో తాజాగా వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా వేదికగా కూడా చేసుకున్నారు. మట్కా సినిమా పై ఉత్సాహంగా ఉన్న వరుణ్.. "ఇది బ్లాస్ట్ అవుతుంది..! ప్రామిస్!" అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియోలో వరుణ్ తేజ్ మొహం చూపించలేదు.. కేవలం ఆయన గొంతు, లుక్ మాత్రం రివీల్ చేశారు. చేతిలో సిగరెట్ పట్టుకొని.. మాఫీయా డాన్ లా మాస్ లుక్ లో కనిపించారు. వీడియోలో "ప్రామిస్" అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. మట్కా స్టోరీ కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో యథార్థ సంఘటనల నేపథ్యంలో రూపొందుతోన్నట్లు తెలుస్తోంది. 1950, 1980 బ్యాక్ డ్రాప్ గా సాగే ఈ కథలో.. ఆ కాలం నాటికి తగ్గట్లు వరుణ్ తేజ్ లుక్, డ్రెస్సింగ్ స్టైల్ డిజైన్ చేసినట్లు చిత్ర యూనిట్ చెబుతుంది. మట్కా సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. Also Read: Pushpa 2: పుష్ఫ2 ఐటమ్ సాంగ్.. సమంతకు మించి ఊపేయనున్న బోల్డ్ బ్యూటీ ఈ సినిమాతో పాటు "ఆపరేషన్ వాలెంటైన్" కోసం సిద్ధమవుతున్నారు మెగా హీరో. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాతో హీరోయిన్ మానుషి చిల్లర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: Ranbir, Bobby Deol: రాముడిగా రణ్ బీర్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్.. మరో సారి కాంబో రిపీట్ #matka-movie #varun-tej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి