Telangana News: తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ షాపుల దగ్గర క్యూలైన్లు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా నగరవాసులు నాన్ వెజ్ తినేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అయితే తాజాగా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వ్యాపారులు స్వలాభం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మేకపోతు అంటూ మేకల మాంసం, కోడి మాంసానికిరంగులు వేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
వికారబాద్ జిల్లా పరిగి పట్టణంలోని విద్యానగర్ కాలనీ లో నివసిస్తున్న మటన్ వ్యాపారి ఎండీ ఖలీల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 15 రోజుల క్రితం కట్ చేసి నిల్వవుంచిన మటన్ ను గుర్తించడంతో అడ్డంగా దొరికిపోయాడు. రోజుల తరబడి నిల్వ ఉంచడమే కాదు..20రోజులకు సరిపడా మటన్ ఒకేసారి కట్ చేసి ఇంట్లో నిల్వ ఉంచుతున్నట్లు తెలిపాడు. మటన్ అమ్మే సమయంలో ఫ్రెష్ గా కనిపించేందుకు వెనిగర్ కలిపిన నీళ్లలో ముంచి కల్తీ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. మటన్ వ్యాపారి ఇంట్లో దాదాపు 60 నుంచి 70 కిలోల మటన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు. ఈ విషయం జిల్లాఎస్పీద్రుష్టికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: వీటిని జాతీయ రహాదారులుగా గుర్తించండి.. గడ్కరికి కోమటి రెడ్డి వినతి..!!
జిల్లాలో ప్రజలు కల్తీ, నకిలీ ఆహారాలు పైన అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా నకిలీ, కల్తీ జరిగిన అసాంఘిక కార్యకలాపాలు జరిగిన తమ పరిధిలోని పోలీస్ అధికారులకు గాని జిల్లా టాస్క్ ఫోర్స్ SI ప్రశాంత్ వర్ధన్ సెల్ నంబర్ 8712583483కు సమాచారం అందించాలన్నారు.