వీటిని జాతీయ రహాదారులుగా గుర్తించండి.. గడ్కరికి కోమటి రెడ్డి వినతి..!!

జాతీయ రహదారులు,రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రం 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు.

New Update
వీటిని జాతీయ రహాదారులుగా గుర్తించండి.. గడ్కరికి కోమటి రెడ్డి వినతి..!!

జాతీయ రహదారులు,రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, తీర్థ స్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు.

అందులో మొదటి ప్రాధాన్యంగా ఈ క్రింద పేర్కొన్న 780 కి.మీ. ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా ఈ 2024-25 వార్షిక ప్రణాళికలో పెట్టి అప్ గ్రేడ్ చేయవలసిందిగా కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 6 రాష్ట్ర రహదారులను, జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయడం గురించి వివరించినట్లు తెలిపారు.

publive-image

1 చౌటుప్పల్- (NH-65) – ఆమన్ గల్ – షాద్ నగర్ – సంగారెడ్డి (NH-65) 182.
2 మరికల్ (NH-167)- నారాయణ్ పేట్ – రామ్ సముద్రం (NH-150) 63.
3 పెద్దపల్లి (SH-1) – కాటారం (NH-353C) 66.
4 పుల్లురు (NH-44)- ఆలంపూర్ – జెట్ ప్రోల్ – పెంట్లవెల్లి – కొల్లాపూర్ – లింగాల్ – అచ్చంపేట్ – దిండి (NH-765)- దేవరకొండ (NH-167)- మల్లెపల్లి (NH-167)- నల్గొండ (NH-565)- 225.
5 వనపర్తి –కొత్తకోట –గద్వాల్ –మంత్రాలయం(NH-167) 110
6 మన్నెగూడ (NH-163)- వికారాబాద్ – తాండూర్ – జహీరాబాద్ – బీదర్ (NH-50) 134
మొత్తం 780 కిమీ గురించి చర్చించనట్లు తెలిపారు.

publive-image

ఇది కూడా చదవండి: 35 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినాల్సిన ఫుడ్స్ ఇవే..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు