AP Higher Education Department: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం శాఖల అధికారుల మార్పుపై దృష్టి సారింది. ఇంతకు ముందు ఉన్నవారు సెలవులపై వెళ్ళడం, బదీలీలు అవడంతో ఆ స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తోంది గవర్నమెంట్. ఇప్పటివరకు ఏపీ ఉన్నత విద్యాశాఖాధికారిగా ఉన్న జె.శ్యామలరావును టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే. టీటీడీ ఈవోగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఖాళీ అయిన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పదవిలో పోలా భాస్కర్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ విద్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యశాఖ మంత్రులతో సమావేశంలో పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను సమర్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. దాంతోపాటూ 2018-19 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ల వివరాలు, ఎప్ సెట్ లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజి ఏమేరకు ఇవ్వాలి, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఏమేరకు ఉండాలనే విషయమై కూడా నోట్ సమర్పించాలని లోకేష్ కోరారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీలు, రిక్రూట్ మెంట్ చేయాల్సిన ఫ్యాకల్టీ వివరాలు, రాష్ట్రవిభజనలో ఉన్నత విద్యకు సంబంధించిన పెండింగ్ అంశాలు, లెర్నింగ్ మ్యానేజ్ మెంట్ సిస్టమ్ ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Also Read:ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి బాబ్రీ మసీదు పేరు తొలగింపు