Rudra Karan Partaap : ప్రముఖ జ్యోతిష్యుడు(Astrologer) రుద్ర కరణ్ పర్తాప్.. ప్రధాని మోదీ(PM Modi) గురించి, ఇండియా - పాకిస్థాన్‌కు సంబంధించి పలు కీలక విషయాలను అంచనా వేశారు. 2024లో మళ్లీ మోదీ దేశ ప్రధాని అవుతారని.. 2025లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK) భారత్(India) లో కలుస్తుందని ఎక్స్(ట్విట్టర్) వేదికగా జోస్యం చెప్పారు. 'జ్యోతిష్యపరంగా చూసుకుంటే ప్రదాని మోదీ ప్రస్తుతం అంగారక మహాదశకు వెళ్తున్నారు. ఈ కాల వ్యవధిలో భూమికి సంబంధించిన సమస్యలు ప్రధానంగా మారుతాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం.. 2025 ఏప్రిల్ నుంచి 2025 సెప్టెంబర్ మధ్య భారత్‌లో కలిసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ 2024లో మళ్లీ అధికారంలోకి వస్తారు' అంటూ పేర్కొన్నారు.
Also Read : మహిళలకు ఏడాదికి లక్ష.. రాహుల్ సంచలన ప్రకటన
ఇదిలాఉండగా.. రుద్ర కరణ్ పర్తాప్ గతంలో కూడా అంచనా వేసిన కొన్ని విషయాలు నిజమయ్యాయి. 2022 మార్చిలో.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కు 2024 మార్చిలో గట్టి సవాళ్లను ఎదుర్కొంటారని ఎక్స్‌లో తెలిపారు. అంతేకాదు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇమ్రన్ ఖాన్ జైలుకు వెళ్లడం, 2022 ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా వరదలు లాంటి విషయాలపై కూడా గతంలో ఆయన జోస్యం చెప్పారు. దీంతో అప్పటినుంచి ఆయనకు గుర్తింపు వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన.. పీవోకే, మోదీ మళ్లీ ప్రధాని కావడం వంటి విషయాలను అంచనా వేయడంతో.. వీటిపై ఆసక్తి నెలకొంది.
Also Read: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈసారి థీమ్ ఏంటంటే